
అమరావతి: కూటమి నేతలు స్వార్థంతో వ్యవహరిస్తున్నారని వైసిపి మాజీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. వైసిపి హయాంలో నాలుగు పోర్టుల నిర్మాణం చేపట్టామని, ప్రభుత్వానికి కనువిప్పు కలగాలనే ఈ సభ పెట్టామని అన్నారు. ఈ సందర్భంగా నౌపాడ, శ్రీకాకుళం జిల్లా లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూలాపేట పోర్టు రాష్ట్ర అభివృద్ధికి కీలమని, వలసలు నివారించేందుకే మూలాపేట పోర్టును మాజీ మంత్రి వైసిపి జగన్ మోహన్ రెడ్డి నిర్మించారని, తమ హయాంలోనే 70 శాతం పోర్టు నిర్మాణం జరిగిందని బొత్స తెలియజేశారు. జగన్ కు క్రెడిట్ వస్తుందనే పనులు నిలిపివేయడం దారుణమని విమర్శించారు. రైతులకు కనీసం ఇన్ ఫుట్ సబ్సిడీ ఇవ్వడం లేదని, పేరుకే సూపర్ హిట్, ఒక్క పేదవాడికి న్యాయం జరగలేదని మండిపడ్డారు. పోర్టు చూస్తామంటే టిడిపికేంటి బాధ? టిడిపి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటీ? అని ప్రశ్నించారు. వైసిపి ప్రభుత్వాన్ని ఎందుకు ఆపుతున్నారు? భయంతో ఎన్నాళ్లు పాలిస్తారు? అని ప్రశ్నించారు. విశాఖకు డేటా సెంటర్ ను ఎవరు తెచ్చారో అదానే చెప్పారని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.