Reading Time: 2 minutes
Wankhede Stadium Proposal Mi Fan Proposes Kkr Girl Ring Slip Sparks Viral Moment

Wankhede Stadium Proposal: ఐపీఎల్ 2026లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ – ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబై ఇండియన్స్‌ అభిమాని ఒకరు, Kolkata Knight Riders జెర్సీ ధరించి ఉన్న తన భాగస్వామికి స్టేడియంలోనే ప్రపోజ్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్న సమయంలో, స్టాండ్స్‌లో మోకాళ్లపై కూర్చున్న ముంబై అభిమాని తన ప్రేయసికి ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే, అదే సమయంలో అతని చేతిలోని ఉంగరం జారి కింద పడిపోవడంతో అక్కడ కొద్దిసేపు గందరగోళం నెలకొంది.

Read Also: KitKat Truck Theft: చాక్లెట్ల దొంగ.. 12 టన్నుల ‘కిట్‌క్యాట్‌’లు ఉన్న ట్రక్కు చోరీ..

ఆ ఉంగరం కోసం ప్రేక్షకులంతా సీట్లు, మెట్ల మధ్య వెతకడం ప్రారంభించారు. కొంతసేపు ఆ ప్రాంతంలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొన్నప్పటికీ, చివరకు ఉంగరం దొరకడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం నవ్వులతో ఆ ప్రదేశం మార్మోగింది. ఉంగరం దొరికిన తరువాత, యువకుడు మళ్లీ ప్రపోజ్ చేయగా, ఆ యువతి అంగీకరించింది. దీంతో ఆ క్షణం మరింత ప్రత్యేకంగా, చిరస్మరణీయంగా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.

ఇక, మ్యాచ్ విషయానికి వస్తే, ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్‌కు 221 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో రోహిత్‌ శర్మ, ర్యాన్ రికెల్టన్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. వీరిద్దరూ కలిసి 148 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు బలమైన పునాది వేశారు. చివరికి, ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి అభిమానులకు డబుల్ ఆనందాన్ని అందించింది. ఒకవైపు ప్రేమ ప్రపోజల్, మరోవైపు జట్టు విజయం.. ఈ మ్యాచ్‌ను అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేశాయి.