
ఇంటి నిర్మించేటప్పుడు కచ్చితంగా వాస్తు సిద్దాంతాన్ని పాటించాలి. వాష్ రూమ్స్.. బెబ్ రూమ్ ఇలా ప్రతి దానికి వాస్తు ఉంటుంది. అయితే ఒకే వాష్ రూమ్లో రెండు వాష్ రూంలు నిర్మించుకోవచ్చా. ఏదిక్కులో నిర్మించు కోవాలి.. అలానే బావిని పూడ్చి గది కాని ఏ ఇతర నిర్మాణమైనా చేయవచ్చా.. మొదలగు విషయాల గురించి . .. వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ గారి సలహాలను ఒకసారి తెలుసుకుందాం..!
ప్రశ్న: నైరుతి వైపు మాస్టర్ బెడ్రూబ్ లో రెండు బాత్రూమ్స్ కట్టుకోవచ్చా? ఏవైపు ఉంటే బాగుంటుంది?
జవాబు : మాస్టర్ బెడ్రూమ్లో రెండు వాష్రూమ్స్ కట్టుకోవచ్చు. వాస్తు ప్రకారం ఇందులో దోషం లేదు. అయితే ఒకటి వాయువ్యంలో .. రెండోది ఆగ్నేయంలో కట్టుకోవాలి.
►ALSO READ | రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చినా… భారతీయులకు గుండెపోటు ఎందుకు వస్తుంది ? డాక్టర్ల హెచ్చరిక…
ప్రశ్న: పాత వ్యవసాయ బావిని పూడ్చి, అదే స్థలంలో పశువుల పాక కట్టుకోవాలి అనుకుంటున్నాం. అలా చేయొచ్చా? ఏమైనా జాగ్రత్తలు పాటించాలా?
జవాబు : వ్యవసాయ బావిని అవసరం లేదనుకుంటే పూడ్చుకోవచ్చు. కానీ, దాన్ని పూడ్చేసి, అదే స్థలంలో పశువుల పాక లేదా వేరే నిర్మాణం కానీ, చేయకపోవడమే మంచిది. బావి ఉన్నచోటుకు కొంచెం దూరంలో కట్టుకోవాలని వాస్తు కన్సల్టెంట్ కాశీనాధుని శ్రీనివాస్ సూచిస్తున్నారు.