Reading Time: < 1 minute

హైదరాబాద్: మీడియా చిట్‌చాట్‌లో సిఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ సిఎం, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ వల్లే తన గొప్పతనం ఏంటో తెలంగాణ సమాజానికి తెలిసిందని రేవంత్ అన్నారు. అసలు కెసిఆర్ లేకపోతే.. తాను లేనంటూ చెప్పుకొచ్చారు. ‘కెసిఆర్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది. కెసిఆర్ లేకపోతే నేను లేను. రావణుడి చెడు వల్లే రాముడి గొప్పతనం తెలిసింది. కెసిఆర్ రెస్ట్ తీసుకుంటున్నారని అంతా అనుకుంటున్నారు. కానీ, ఆయన్ను గృహ నిర్భందం చేశారని నాకు అనుమానంగా ఉంది. కాలనాగు కంటే హరీశ్ రావు ప్రమాదం’ అని సిఎం పేర్కొన్నారు.