
దక్షిణ సూడాన్ మరోసారి మృత్యుఘోషతో విలవిలలాడిపయింది. రాజధాని జుటా శివార్లలోని ఓ బంగారు గని వద్ద తలెత్తిన వివాదంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపగా.. 70 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ‘‘ఓ బంగారు గనిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో 70 మందికిపైగా మరణించారు. అనేక మంది గాయపడ్డారు’’ అని పోలీసులు తెలిపారు. దక్షిణ సూడాన్ ప్రతిపక్ష పార్టీ ‘సూడన్ పీపుల్స్ లిబరేషన్ మూవ్‌మెంట్ ఇన్ అపోజిషన్’ ఈ దాడిని ఖండించింది. ప్రభుత్వ బలగాలే ఈ దుశ్చర్యకు పాల్పడ్డాయని ఆరోపించింది.