Reading Time: < 1 minute

హైదరాబాద్: నియోజకవర్గాల పునర్వవస్థీకరణలో దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గాల పునర్వవస్థీకరణ పార్టీల సమస్యకాదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా దక్షిణాదిలో కార్యాచరణ ఉండాలని, 50 శాతం సీట్ల పెంపుపై విస్తృతంగా చర్చ జరగాలని అధికారులకు సూచించారు. దేశంలో నియంత పాలన రాకూడదన్నదే తన ఉద్దేశం అని తెలియజేశారు. దక్షిణాదికి బలం లేదని పెత్తనం చేస్తామంటే అది ఎంత కాలమో కొనసాగదని అన్నారు. జాతీయ పార్టీ అయినా అన్యాయంపై మాట్లాడే స్వేచ్ఛ తమకు ఉందని, 50 శాతం సీట్లు పెంచితే దక్షిణ భారతదేశానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. 50 శాతం సీట్లు పెంచితే దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యం చేస్తుందని, దక్షిణాదిలో ఒక్క సీటు రాకున్నా కేంద్రం సర్కారు ఏర్పాటు చేసుకోవచ్చునని చెప్పారు. రాష్ట్రాల సీట్ల మధ్య అంతరం.. పెంచిన తర్వాత కూడా అంతే ఉండాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.