
హైదరాబాద్: హేట్ స్పీచ్ బిల్లు అత్యంత ప్రమాదకరమని బిజెపి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. రాజకీయ కక్షసాధింపులకే హేట్ స్పీచ్ బిల్లు అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో హేట్ స్పీచ్ ప్రివెన్షన్ బిల్లును సెలక్ట్ కమిటీకి స్పీకర్ గడ్డం ప్రసాద్ రిఫర్ చేశారు. ఈ సందర్భంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ఆధారాలు లేకున్నా అరెస్ట్ చేసేలా బిల్లు ఉందని, ఇలాంటి చట్టం చేసేముందు హౌస్ కమిటీ వేయాలని.. చర్చ సాగాలని డిమాండ్ చేశారు. సెక్షన్ 4 అనేది ప్రజాస్వామ్యానికి డెత్ వారెంట్ అని.. హేట్ స్పీచ్ బిల్లును వ్యతిరేకిస్తున్నామని ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలియజేశారు.