Reading Time: < 1 minute

హైదరాబాద్: రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అంశంలో సభా సంఘం వేయాలని కోరితే సిఐడిని అడ్డం పెట్టుకొని మంత్రి పొంగులేనటి రక్షించే ప్రయత్నం చేస్తున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ప్రతిపక్షన్ని ప్రభుత్వం బెదిరించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. పార్టీ నేతలతో కలిసి లోక్‌భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కెటిఆర్ కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటిపై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పెద్దలే గద్దలుగా మారి అవినీతికి పాల్పడుతున్నారని కెటిఆర్ విమర్శించారు. ఈ అంశంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని.. స్వతంత్ర విచారణకు ఆదేశించాలని కోరినట్లు చెప్పారు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని గవర్నర్‌ను కోరామని అన్నారు