Reading Time: < 1 minute

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఏర్పడిన గ్యాస్ కొరతను అధిమించేందుకు ప్రభుత్వాలు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న నిల్వలను సంరక్షించుకోవాలని కోరుతున్నాయి. అయితే కొందరు మాత్రం అక్రమ మార్గంలో డబ్బు సంపాదించేందుకు తప్పు పనులకు పూనుకుంటున్నారు. అలా బహిరంగ మార్కెట్‌లో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ దందా చేస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.

ముఠాగా ఏర్పడి కమర్షియల్ సిలిండర్లను అక్రమంగా మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. హోటళ్లు, రెస్టారెంట్లకు అధిక ధరలకు గ్యాస్ విక్రయిస్తున్నట్లు కనిపెట్టారు. 300 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. డీలర్ అమీర్ ఒక్కో సిలిండర్‌ను రూ.6 వేలకు విక్రయిస్తున్నట్లు తేలింది. డీలర్‌తో పాటు 10 మందిని అరెస్టు చేశారు.