
Rajasthan Royals vs Chennai Super Kings, 3rd Match, Indian Premier League 2026: ఐపీఎల్ 2026లో భాగంగా మూడో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ గౌహతిలోని బర్సపారా స్టేడియంలో మొదలైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ టీం తొలుత బ్యాటింగ్ చేయనుంది. చెన్నై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, డెవాల్డ్ బ్రెవిస్ నేటి మ్యాచ్‌కు దూరమయ్యారు. బ్రెవిస్ మూడు మ్యాచ్‌లకు దూరమవ్వగా, ధోని రెండు వారాల పాటు జట్టుకు దూరంగా ఉంటాడు.
చెన్నై టీం ఐదుసార్లు ఛాంపియన్ (2010, 2011, 2018, 2021, 2023)గా నిలిచిన సంగతి తెలిసిందే. కానీ గత సీజన్‌లో చెన్నై జట్టు ఘోరంగా విఫలమైంది. పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో నిలిచింది. మరోవైపు, రాజస్థాన్ రాయల్స్ టీం 2008లో టైటిల్ గెలిచినప్పటి నుంచి మళ్లీ ఒక్క టైటిల్ గెలవలేదు. గత సీజన్‌లో 9వ స్థానంలో నిలిచింది.