Reading Time: < 1 minute
Honey Rose Molestation Incident Kerala Mall Event Controversy

కేరళ కుట్టి, టాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి హనీ రోజ్ కు అనూహ్యమైన రీతిలో ఒక చేదు అనుభవం ఎదురైంది. కేరళలోని ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వెళ్ళిన ఆమెపై, అభిమానుల ముసుగులో కొందరు వ్యక్తులు అతిగా ప్రవర్తించడంతో సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతోంది. కేరళలో కొత్తగా ప్రారంభమైన ఒక భారీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఈవెంట్‌కు హనీ రోజ్ హాజరయ్యారు, ఆమెను చూడటానికి వేల సంఖ్యలో అభిమానులు ఎగబడ్డారు. ప్రారంభంలో అంతా సజావుగానే సాగినా, ఒక్కసారిగా అభిమానులు సెల్ఫీల కోసం ఆమె చుట్టూ చేరడంతో పరిస్థితి అదుపు తప్పింది.

Also Read : Hema: హేమకు క్లీన్ చీట్.. చనిపోవాలి అనుకున్నానంటూ షాకింగ్ కామెంట్స్!

సెల్ఫీ తీసుకునే క్రమంలో కొందరు వ్యక్తులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఆమెకు అతి దగ్గరగా రావడమే కాకుండా, ఏకంగా ఆమె నడుమును తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో తీవ్ర అసౌకర్యానికి లోనైన హనీ రోజ్, అక్కడికక్కడే షాక్‌కు గురయ్యారు. తనను ఇబ్బంది పెడుతున్నారని గ్రహించిన హనీ రోజ్, వెంటనే ఆ సెల్ఫీ పిచ్చిగాళ్ళ నుంచి దూరంగా జరిగి అక్కడి నుండి నిష్క్రమించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. సినిమా తారలను చూడాలనే ఆరాటం ఉండొచ్చు కానీ, అది అరాచకత్వానికి దారి తీయకూడదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సినీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ లో కూడా రాజాసాబ్ ఈవెంట్లో నిధి అగర్వాల్ కు సైతం ఇలాంటి చెడు అనుభవమే ఎదురైంది. ఆమెను తాకేందుకు అభిమానులు ప్రయత్నించారు.