Reading Time: < 1 minute

గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ

Caption of Image.

హైదరాబాద్: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సోమవారం (మార్చి 30) బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. లోక్ భవన్‎కు వెళ్లిన బీఆర్ఎస్ బృందం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మైనింగ్ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‎కు వినతి పత్రం అందజేశారు. హైకోర్టు జడ్జితో విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. 

వేల కోట్ల ప్రజా సంపదను మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్  ద్వారా కొల్లగొడుతున్నారని బీఆర్ఎస్ శాసన సభా పక్ష బృందం ఆరోపించింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీష్ రావు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 

ఆదివారం (మార్చి 29) కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మైనింగ్ వ్యవహారంపై అసెంబ్లీలో  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. మంత్రి పొంగులేటి రాఘవ కన్ స్ట్రక్షన్ ద్వారా అక్రమ మైనింగ్‎కు పాల్పడుతూ ప్రభుత్వానికి ఆదాయానికి గండి కొడుతున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. 

రాఘవ కన్‎ స్ట్రక్షన్స్ మైనింగ్‏పై వ్యవహారాలపై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో గత పదేండ్ల కాలంలో జరిగిన ప్రతి అక్రమ మైనింగ్‎పై పూర్తిస్థాయిలో  సీబీ సీ-ఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్టు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 

©️ VIL Media Pvt Ltd.