Reading Time: < 1 minute
Ms Dhoni Injury Shock May Miss Ipl 2026 Season Retirement Buzz Grows

ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) అభిమానులకు భారీ షాక్ తగిలిన విషయం తెలిసిందే. టీమిండియా దిగ్గజం, సీఎస్‌కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2026లో మొదటి రెండు వారాలకు దూరమయ్యాడు. ఇదంతా తెలిసిన విషయమే.. తాజాగా ఓ షాకింగ్ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లెజెండరీ క్రికెటర్ ధోనీ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యే అవకాశముందని సమాచారం. అంతేకాదు ఇదే మహీకి చివరి సీజన్ అని కూడా అంటున్నారు. దీనిపై సీఎస్‌కే లేదా ధోనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

కొన్ని రోజుల క్రితం సీఎస్‌కే ప్రాక్టీస్ సెషన్‌లో ఎంఎస్ ధోనీ గాయపడిన విషయం తెలిసిందే. గాయపడిన ఆయనకు వైద్యులు రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. మొదట ఇది చిన్న గాయమేనని భావించినప్పటికీ.. తాజా సమాచారం ప్రకారం మహీకి అయిన గాయం పెద్దదే అని తెలుస్తోంది. గాయం కారణంగా ధోనీ ఐపీఎల్ 2026 మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇది నిజమైతే చెన్నై జట్టుకు మాత్రమే కాకుండా ధోనీ అభిమానులకు కూడా షాకింగ్ న్యూస్ అవుతుంది.

Also Read: Maoist Narayana: అందుకే.. దేశ వ్యాప్తంగా పార్టీ కనుమరుగైంది!

మరింత ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఇదే ఎంఎస్ ధోనీకి చివరి ఐపీఎల్ సీజన్ అయ్యే అవకాశం ఉందన్న చర్చ కూడా నెట్టింట మొదలైంది. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ (టెస్టులు, వన్డేలు, టీ20)కు వీడ్కోలు పలికిన ధోనీ.. ఐదేళ్లుగా ఐపీఎల్‌లో ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పుడు ఐపీఎల్‌కు కూడా వీడ్కోలు చెప్పే అవకాశం ఉందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ వార్తలపై అధికారిక ప్రకటన కోసం చెన్నై మేనేజ్‌మెంట్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.