Reading Time: 2 minutes

పెళ్లి కూతురైన మీనాక్షి చౌదరి? నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు!

Caption of Image.

టాలీవుడ్ అందాల చందమామ మీనాక్షి చౌదరి పెళ్లి పీటలు ఎక్కబోతుందా? గత కొన్ని రోజులుగాఒక యువ హీరోతో ఆమె పీకల్లోతు ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని ప్రచారం జరిగింది.  అయితే లేటెస్ట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు చూస్తుంటే నెటిజన్లలో ఇదే అనుమానం బలపడుతోంది. ఆమె పంచుకున్న కొన్ని ఫోటోలు, వీడియోలు టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.

 అసలు కథేంటి?

మీనాక్షి చౌదరి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో దాదాపు 20 ఫోటోలతో పాటు ఒక చిన్న వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె నవ వధువులా ముస్తాబై, సంప్రదాయబద్ధమైన దుస్తులు, ఖరీదైన ఆభరణాలతో మెరిసిపోతోంది. ముఖ్యంగా ఆ వీడియోలో ఆమె పెళ్లి కూతురిలా సిగ్గుపడుతూ నడుచుకుంటూ వస్తుంటే, అది చూసిన అభిమానులు “మీనాక్షికి నిజంగానే పెళ్లి జరిగిపోయిందా?” అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.

అయితే, ఈ వైరల్ ఫోటోల వెనుక ఉన్న అసలు నిజం వేరే ఉంది. ఇది ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పెళ్లి వేడుక కాదు, కేవలం ఒక కమర్షియల్ ఫోటో షూట్‌లో భాగం మాత్రమే. ఒక ప్రముఖ జ్యువెలరీ సంస్థ వెడ్డింగ్ కలెక్షన్ కోసం ఆమె ఈ పెళ్లి కూతురి గెటప్ వేసినట్లు సమాచారం. ఆ పోస్ట్‌లో ఉన్న మిగిలిన ఫోటోలు ఆమె ట్రావెల్ డైరీస్, షూటింగ్ స్పాట్ విశేషాలకు సంబంధించినవి కావడంతో ఇది కేవలం ఒక ‘ర్యాండమ్ పోస్ట్’ అని స్పష్టమైంది.

పెళ్లి గాసిప్స్‌పై మీనాక్షి ఫైర్!

గతంలో కూడా మీనాక్షి పెళ్లి గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. ఒక యువ హీరోతో ఆమె పీకల్లోతు ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై మీనాక్షి గతంలోనే గట్టిగా స్పందించింది. ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం కెరీర్‌పైనే ఉంది. పెళ్లి చేసుకునే ఆలోచన ఇప్పట్లో లేదు. ఇలాంటి అసత్య ప్రచారాలు చూస్తుంటే విసుగు వేస్తోంది అంటూ క్లారిటీ ఇచ్చింది.

కెరీర్ పరంగా దూకుడు
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హర్యానా బ్యూటీ, ‘హిట్-2’ , ‘గుంటూరు కారం’,’ సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ స్టార్ హీరోయిన్ స్టేటస్ వైపు అడుగులు వేస్తున్న మీనాక్షి, తనపై వస్తున్న రూమర్లకు తన పనితోనే సమాధానం చెబుతోంది.
 

 

©️ VIL Media Pvt Ltd.