
ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తల్లి సువర్ణలత ఇవాళ (మార్చి 30, 2026) కన్నుమూశారు. ఎన్నో విభిన్న పాత్రలతో కోట్లాది ప్రేక్షకులను మెప్పించిన ప్రకాశ్ రాజ్ జీవితంలో ఇది పెద్ద విషాదంగా మారింది. తన ఎదుగుదలకు పునాదిగా నిలిచిన తల్లి మరణం ఆయనను తీవ్రంగా కలచివేసింది.
గతంలో తన ఐదేళ్ల కుమారుడు సిద్ధు మరణంతో తీవ్రంగా కుంగిపోయిన సమయంలో తల్లి సువర్ణలత ఆయనకు అండగా నిలిచారు. ఇప్పుడు ఆ నీడ కూడా దూరమవడంతో ప్రకాశ్ రాజ్ తీవ్ర వేదనలో మునిగిపోయారు. తాను తనకు కేవలం తల్లి మాత్రమే కాదు, జీవితానికి గొప్ప ప్రేరణ అని ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ విషాద వార్త తెలిసిన వెంటనే సినీ, రాజకీయ ప్రముఖులు ప్రకాశ్ రాజ్‌కు సానుభూతి తెలుపుతున్నారు.
పవన్ కళ్యాణ్ సంతాపం:
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు, హీరో పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, “ప్రకాశ్ రాజ్ గారి మాతృమూర్తి శ్రీమతి సువర్ణలత గారు కన్నుమూశారని తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. మాతృవియోగంతో బాధపడుతున్న ప్రకాశ్ రాజ్ గారికి, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని తెలిపారు.
ALSO READ : సల్మాన్ ఖాన్ -దిల్ రాజు క్రేజీ కొలాబరేషన్..
ప్రముఖ నటుడు శ్రీ @prakashraaj గారి మాతృమూర్తి శ్రీమతి సువర్ణలత గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. శ్రీమతి సువర్ణలత గారు ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మాతృ వియోగానికి లోనైన శ్రీ ప్రకాష్ రాజ్ గారికి, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) March 30, 2026
సినిమాల్లో కలిసి పనిచేసే ఈ ఇద్దరు నటులు, రాజకీయాల విషయంలో మాత్రం విభేదాలు వ్యక్తం చేస్తుంటారు. అయితే, ఇలాంటి విషాద సమయంలో పవన్ కళ్యాణ్ సానుభూతి తెలియజేయడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.