Reading Time: < 1 minute

పాట్నా: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడి తాతను తగల బెట్టి, బాలికను చంపేసి పొలంలో మృతదేహాన్ని పాతిపెట్టింది. ఈ సంఘటనే బిహార్ రాష్ట్రం మోతీహరి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. శిల్పి కుమారి అనే యువతి నితీష్ కుమార్ అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. వివాహేతర సంబంధానికి నితీష్ తాత పలుమార్లు అడ్డు చెప్పాడు. దీంతో నితీష్ తాతను హత్య చేయాలని శిల్పి ప్లాన్ చేసింది. నితీష్ తాతను శిల్పి తగలబెట్టి అనంతరం తనపై అనుమానం రాకుండా పలు ఇండ్లను తగలబెట్టింది. అందే ఇంట్లో అనుష్క అనే బాలిక తల్లి వీళ్ల సంబంధానికి అడ్డుగా ఉండడంతో చిన్నారిని చంపేసి గ్రామ శివారులో పొలంలో మృతదేహాన్ని పాతిపెట్టింది. బాలిక కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనుమానంతో శిల్పిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో రెండు నిజాలు ఒప్పుకుంది. వెంటనే ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.