
మహారాష్ట్రలో దారుణ ఘటన జరిగింది. ప్రేమ కోసం కన్నతండ్రినే చంపింది ఓ కూతురు. ఆ తర్వాత ప్రియుడే ఆమెను పోలీసులకు పట్టించడంతో సినిమా ఫక్కీలో సాగిన ఈ హత్యోదంతం మూడేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టించింది. సొంత తండ్రిని విషమిచ్చి చంపి, కారుణ్య నియామకం కింద పోలీసు శాఖలో ఉద్యోగం సంపాదించిన ఒక యువతి, చివరకు ప్రియుడితో వచ్చిన విభేదాల కారణంగా కటకటాల పాలైంది. చంద్రపూర్ జిల్లాకు చెందిన హెడ్ కానిస్టేబుల్ జయంత్ బల్లావార్ కుమార్తె ఆర్య… ఆశిష్ అనే యువకుడిని ప్రేమించింది. వీరి ప్రేమను తండ్రి వ్యతిరేకించడంతో, అతడిని అడ్డు తొలగించుకోవాలని ఆర్య కుట్ర పన్నింది. 2023 ఏప్రిల్ 25న తండ్రికి మిల్క్‌షేక్‌లో విషం కలిపి ఇచ్చింది. అది తాగిన కొద్దిసేపటికే జయంత్ మరణించారు. అప్పట్లో దీనిని ‘ప్రమాదవశాత్తు మరణించినట్టుగా భావించిన పోలీసులు కేసును మూసివేశారు. తండ్రి మరణం తర్వాత ఆర్య పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా ఉద్యోగం పొందింది. చిత్రం ఏమిటంటే, ఆమె ప్రియుడు ఆశిష్ కూడా 2025లో పోలీసుగా ఎంపికయ్యాడు. ఇద్దరూ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో కక్ష పెంచుకున్న ఆశిష్, రామ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి అసలు నిజాన్ని బయటపెట్టాడు. విషాన్ని సరఫరా చేసిన మరో యువకుడితో పాటు ఆర్య, ఆశిష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై కేసులు నమోదు చేశారు. కోర్టు… నిందితులను కస్టడీకి అప్పగించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!
చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్ ప్రియురాలు