Reading Time: < 1 minute

ఉపాధి హామీ రక్షణకు..కాంగ్రెస్ నరేగా బచావో ఉద్యమం.. సమన్వయ కమిటీ లో సీతక్కకు కీలక బాధ్యతలు

Caption of Image.

ఉపాధి హమీ పథకం రక్షించేందుకు కాంగ్రెస్ నడు బిగించింది. దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. జనవరి5 నుంచి దేశవ్యాప్తంగా నరేగా బచావో  సంగ్రామ్ పేరుతో  జాతీయ ఉద్యమాన్నిచేపట్టనుంది. ఈ ఉద్యమం నిర్వహణ, పర్యవేక్షణ, సమన్వయం కోసం AICC  ప్రత్యేక సమన్వయ కమిటీని ఏర్పాటు  చేసింది. ఈ ఉద్యమంలో తెలంగాణ నుంచి మంత్రి సీతక్కకు  కీలక బాధ్యతలు అప్పగించింది.

ఆదివారం(జనవరి 4)  మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఏఐసీసీ ‘నరేగా బచావో సంగ్రామ్ ’కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ ఉద్యమంలోఅఖిల భారత స్థాయిలో విస్తృత నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.

సమన్వయ కమిటీ కన్వీనర్‌గాఅజయ్ మాకెన్, సభ్యులుగా జైరాం రమేష్, సందీప్ దీక్షిత్, డా.ఉదిత్ రాజ్, ప్రియాంక్ ఖర్గే, తెలంగాణ నుంచి మంత్రి సీతక్క, దీపికా పాండే సింగ్, డా.సునీల్ పంవార్, మానిష్ శర్మ ఉన్నారు. 

ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, కోట్లాది కూలీల ఉపాధి హక్కులను కాపాడే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమంగా ఈ బచావో సంగ్రామ్ కార్యక్రమం సాగనుందని ఏఐసీసీ స్పష్టం చేసింది.

©️ VIL Media Pvt Ltd.