
యూబ్లా (మెక్సికో): ఇండియా స్టార్ ఆర్చర్, తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్–-1లో బంగారు గురితో మెప్పించింది. సురేఖ, మధుర ధామంగాంకర్, ప్రగతితో కూడిన ఇండియా విమెన్స్ కాంపౌండ్ టీమ్ గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో ఇండియా 233–-232తో అమెరికాపై విజయం సాధించింది.
మూడో రౌండ్ ముగిసేసరికి 173–-174తో వెనుకంజలో నిలిచినా.. ఆఖరి రౌండ్‌లో వరుసగా ఆరు బాణాలను పది పాయింట్ల టార్గెట్‌పై గురిపెట్టిన ఇండియా ఒక పాయింట్ తేడాతో విజయాన్ని అందుకుంది. మరోవైపు కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో ఓజస్ – ప్రగతి జోడీ 154–155తో అమెరికా చేతిలో ఓడింది.