
హైదరాబాద్: కోరిక తీరుస్తానంటూ ప్రైవేట్ ఉద్యోగిని ట్రాప్ చేసిన హిజ్రా లక్షా నలభై వేలు కొట్టేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మార్చి 28న టాస్ పబ్ దగ్గర ఒక ప్రైవేట్ ఉద్యోగికి హిజ్రా పరిచయం అయింది. లైంగిక కోరిక తిరుస్తానంటూ మాయ మాటలు చెప్పి హిజ్రానే రూమ్కి తీసుకెళ్లింది. ముందుగా 3 వేల 500 కు డీల్ మాట్లాడుకుంది.
రూమ్కి వెళ్ళాక అతనితో కొంతసేపు సన్నిహితంగా మెలిగింది. ఇద్దరి మధ్య కొన్ని ప్రైవేట్ మూమెంట్స్ జరిగాయి. ఈ వ్యవహారాన్ని అతనికి తెలియకుండా హిజ్రా ఫొటోలు, వీడియోలు తీసింది. వాటిని అడ్డం పెట్టుకుని ప్రైవేట్ ఉద్యోగిని బెదిరించి రెండు లక్షలు డిమాండ్ చేసింది.
Also Read : షాద్నగర్లో భారీష్ పూజల పేరిట దోపిడీ
అంత డబ్బు అతని దగ్గర లేకపోవడంతో ఇంటికి వెళ్లి బంగారు గాజులు, ఆభరణాలు.. క్యాష్.. ఇలా మొత్తం లక్షా నలభై వేలు తీసుకువచ్చి బాధితుడు హిజ్రాకు ఇచ్చాడు. అయినా హిజ్రా అతనిని వదిలిపెట్టలేదు. బాధితుడి ఇంటి దగ్గరకు వెళ్లి.. ఇంటి బయటే ఉన్నానని.. తన దగ్గర ఫోటోలు, వీడియోలు ఉన్నాయని హిజ్రా మరోసారి బ్లాక్ మెయిల్ చేసింది. దీంతో.. ఇక విసిగిపోయిన బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.