Reading Time: < 1 minute

ఐపిఎల్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. ఎల్ఎస్ జిపై జిటి ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. శుభమన్ గిల్, జోస్ బట్లర్ హాఫ్ సెంచరీలతో కదంతొక్కారు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 165 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ ముందు ఉంచింది. గుజరాత్ జట్టు 18.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ జట్టు శుభ్ మన్ గిల్(56), జోస్ బట్లర్(60) పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు. ప్రసిద్ధ కృష్ణ నాలుగు వికెట్లు తీసి లక్నో నడివిరిచాడు. ప్రసిద్ధి కృష్ణకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.