Reading Time: 2 minutes

IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ముంబై.. ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్

Caption of Image.

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ లో భాగంగా వాంఖడే స్టేడియంలో జరుగుతున్న హై-వోల్టేజ్ పోరులో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచింది. హోమ్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ తీసుకున్నాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు మొదట బ్యాటింగ్‌కు దిగనుంది.

 ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. మేము మొదట బౌలింగ్ చేయాలనుకుంటున్నాం.. ఈ పిచ్ బ్యాటింగ్‌కు చాలా బాగుంటుందని తెలుసు.. వాంఖడేలో ఛేజింగ్ చేయడం ఎప్పుడూ కలిసొచ్చే అంశం.. ఇక్కడ ‘డ్యూ’ (మంచు) ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి, ఎంత స్కోరును ఛేజ్ చేయాలో తెలిస్తే ఇన్నింగ్స్‌ను చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు.. మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేసి మ్యాచ్‌ను గెలవాలని అనుకుంటున్నాం.. జట్టులో రెండు కీలక మార్పులు చేశాం.. దీపక్ చాహర్, గజన్ఫర్ స్థానాల్లో మయాంక్ మార్కండే, మిచెల్ సాంట్నర్ తుది జట్టులోకి వచ్చారని పాండ్యా వెల్లడించారు.

RCB కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ.. మేము కూడా మొదట బౌలింగ్ చేయాలనుకున్నాం, కానీ టాస్ మన చేతుల్లో ఉండదు కదా.. ఇదొక అద్భుతమైన బ్యాటింగ్ ట్రాక్.. బంతి బ్యాట్‌పైకి బాగా వస్తుంది.. కాబట్టి మొదట బ్యాటింగ్ చేసినా పెద్దగా నష్టమేమీ లేదు.. బోర్డుపై భారీ స్కోరు ఉంచి ముంబైని ఒత్తిడిలోకి నెట్టడమే మా లక్ష్యం.. గత మ్యాచ్‌లో 97 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినా 200 పైగా పరుగులు చేశాం, ఆ నమ్మకం మాలో ఉందన్నాడు. ఇక తుది జట్టులో ఒక మార్పు చేశాం.. జోష్ హేజిల్‌వుడ్ స్థానంలో జాకబ్ డఫీ జట్టులోకి వచ్చాడని పాటిదార్ తెలిపాడు.

►ALSO READ | IPL 2026 : చెలరేగిన గిల్, బట్లర్.. లక్నోపై గుజరాత్ ఘన విజయం

జట్లు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), టిమ్ డేవిడ్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మ. 
 

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, ట్రెంట్ బౌల్ట్, మయాంక్ మార్కండే, జస్ప్రీత్ బుమ్రా 

©️ VIL Media Pvt Ltd.