Reading Time: < 1 minute

ప్రముఖ గాయని ఆశా భోస్లేకు గుండెపోటు రావడంతో స్థానిక బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో హుటాహుటిన చికిత్సకు చేర్పించారు. వేలాది పాటల గాయని ఆశాభోస్లే వయస్సు 92 పంవత్సరాలు. దిగ్గజ గాయని లతామంగేష్కర్‌కు చిన్న సోదరి అయిన ఆమెకు చాలాకాలంగా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయి. దీనితో శ్వాస కోశ అవలక్షణాలను ఎదుర్కొంటున్నారు. చికిత్సకు ఆమెను ఆసుపత్రికి తరలించిన విషయాన్ని కుటుంబ వర్గాలు, సన్నిహితులు తెలియచేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎప్పటికప్పుడు డాక్టర్ల బృందం పరీక్షలు నిర్వహిస్తున్నారని ప్రకటన వెలువడింది.