Reading Time: < 1 minute
వరికోత కోస్తున్న కూలీలు..దుబ్బుల మాటున ఉన్నది చూసి హడల్‌

రైతు కూలీలు పొలంలో వరికోత కోస్తున్నారు. కూలీలంతా తమ పనిలో నిమగ్నమై ఉండగా వెనుకనుంచి వింత శబ్దాలు వినిపించాయి. మొదట లైట్‌ తీసుకున్న కూలీలు ఆ శబ్దం మరింత పెరగడం.. ఏదో పాకుతున్నట్టుగా అలికిడి కావడంతో అంతా వెనక్కి తిరిగి చూశారు. అంతే వారి గుండె జారినంత పనైంది. వెంటనే అక్కడినుంచి దూరంగా పరుగులు తీశారు. మహబూబాబాద్ జిల్లా సుధానపల్లికి చెందిన రైతు వెంకన్న తన పొలంలో వరి కోతలు కోయిస్తున్నారు. రైతులు, కూలీలు పనిలో నిమగ్నమై ఉండగా, ఎక్కడి నుండి వచ్చిందో కానీ, పొలం మధ్యలో 7 అడుగుల పొడవున్న భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. దాన్ని చూడగానే కూలీలు భయంతో కేకలు వేస్తూ చెల్లాచెదురుగా పరిగెత్తారు. ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఆందోళనకరంగా మారిపోయింది. కొండచిలువను చూసి అంతా భయంతో వణికిపోతుంటే, రైతు వెంకన్న మాత్రం ధైర్యంగా ముందుకు వెళ్లాడు. కర్ర సహాయంతో ఆ కొండచిలువను లొంగదీసుకున్నాడు. అంతటితో ఆగక, ఆ భారీ కొండచిలువకు ఎలాంటి హాని కలగకుండా, కర్రతో దాన్ని తన భుజాన వేసుకున్నాడు. సుమారు 7 అడుగుల కొండచిలువను భుజంపై మోస్తూ వెళ్తుంటే స్థానికులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి చూస్తుండిపోయారు. వెంకన్న ఆ కొండచిలువను ఊరి చివర ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సురక్షితంగా వదిలిపెట్టాడు. దీంతో కూలీలు, గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణాలకు తెగించి ఆ కొండచిలువను పట్టుకున్న రైతు వెంకన్న సాహసాన్ని అంతా మెచ్చుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి

UPI Rules 2026: RBI కొత్త ప్రతిపాదన.. UPI పేమెంట్లలో గంట ఆగాల్సిందే

డీజిల్ ట్యాంకర్ బోల్తా.. పండగచేసుకున్న జనం

చిన్నారుల రక్తపు మరకల.. బ్యాగులతో చర్చలు

మహిళా పోలీసుల అండర్‌ కవర్‌ ఆపరేషన్‌.. ఆరుగురు అరెస్ట్‌