Reading Time: < 1 minute
Gold Prices: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. వరుసగా రెండో రోజు కూడా.. ఇప్పుడు తులం ఎంతంటే..?

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణపై రోజుకో ప్రకటన రావడం, అనిశ్చితి నెలకొన్న వేళ పసిడి ధరలు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. యుద్దం మొదలైన తర్వాత ధరలు పడిపోగా.. ఆ తర్వాత మళ్లీ పెరిగాయి. ఇటీవల ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటించిన క్రమంలో రేట్లు తగ్గా.. కాల్పుల విమరణపై అనిశ్చితి నెలకొన్న వేళ మళ్లీ పెరుగుదల నమోదు చేస్తున్నాయి. దీంతో బంగారం, వెండి ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో ఊహించని పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం వివిధ నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయనేది చూద్దాం.

ఇవాల్టీ గోల్డ్ రేట్లు ఇవే..

-హైదరాబాద్‌లో ఏప్రిల్ 12వ తేదీన బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెటల్ బంగారం ధర ప్రస్తుతం రూ.1,52,840 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో చూసుకుంటే రూ.490 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,40,100 వద్ద ట్రేడువతోంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.450 మేర పెరిగిందని చెప్పవచ్చు.

-విజయవాడ, విశాఖపట్నంలో కూడా పై ధరలు కొనసాగుతున్నాయి.

-ఇక చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,53,820 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,000 వద్ద కొనసాగుతోంది.

-ఇక బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,52,840 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,100 వద్ద ట్రేడవుతోంది.

-ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,990 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,40,250 వద్ద ఉంది.

వెండి ధరలు ఇలా..

-ఇక వెండి ధరలు మాత్రం స్ధిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2.60 లక్షల వద్ద కొనసాగుతోంది.

-హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2.65 లక్షలుగా ఉంది.

-చెన్నైలో కేజీ సిల్వర్ రూ.2.65 లక్షలుగా ఉంది

-ఇక బెంగళూరులో కేజీ వెండి ధర రూ.2.60 లక్షల వద్ద కొనసాగుతోంది.