Reading Time: < 1 minute
Us Iran Talks Fail Islamabad Iran Reacts

Iran: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలమయ్యాయి. రెండు దేశాల మధ్య 21 గంటల పాటు చర్చలు జరిగినా కొలిక్కి రాలేదు. 40 రోజులు మిడిల్ ఈస్ట్ సంక్షోభానికి ఎండ్ కార్డ్ పడుతుందని అంతా అనుకున్నప్పటికీ, పరిస్థితి మళ్లీ యుద్ధానికి వచ్చింది. ఈ చర్చలు ఎలాంటి ఫలితం లేకుండా ముగిసిన తర్వాత, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ గాలిబాఫ్ స్పందించారు. ‘‘ఇరాన్ నమ్మకాన్ని గెలుచుకోవడంలో అమెరికా విఫలమైంది’’ అని అన్నారు.

Read Also: Devendra Fadnavis: కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీని తొలగించవచ్చు.. ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు..

ఆయన సోషల్ మీడియాలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ దూరదృష్టితో, సానుకూల ప్రతిపాదనల్ని అమెరికా ముందుంచిందని అయితే, తమ నమ్మకాన్ని గెలుచుకోవడంలో అమెరికా విఫలమైందని చెప్పారు. ఇదే సమయంలో చర్చలు పూర్తిగా విఫలం కాలేదని చెప్పారు. అమెరికా ఇప్పుడు ఇరాన్ తర్కాన్ని, సూత్రాలను అర్థం చేసుకుందని, ఇప్పుడు మా నమ్మకాన్ని పొందగలదా లేదా అని నిర్ణయించుకోవాలి అని అన్నారు. అమెరికాతో ఒప్పందానికి రావడానికి ఇరాన్ తొందరపడటం లేదని, ఇరాన్ తన హక్కుల్ని కాపాడుకోవడానికి దౌత్యాన్ని ఒక మార్గంగా భావిస్తోందని చెప్పారు.