Reading Time: < 1 minute

గుడ్ న్యూస్.. సీబీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. రూ.60 వేల నుంచి లక్ష వరకు జీతం

Caption of Image.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 9న ప్రారంభమై ఏప్రిల్ 30 వరకు కొనసాగుతుంది. 

మొత్తం ఖాళీలు: 26. 
విభాగాల వారీగా ఖాళీలు: అనలైటిక్స్ & మోడల్ రిస్క్ (స్కేల్ IV/III) 06, అసెట్ లయబలిటీ మేనేజ్ మెంట్ (స్కేల్ III/II) 05, డిజిటల్ రిస్క్ మేనేజ్ మెంట్ (స్కేల్ III/II) 08, ఎంటర్‌ప్రైజ్ రిస్క్ (స్కేల్ III) 05, మార్కెట్ రిస్క్ (స్కేల్ III/II) 02.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్/ బీఎస్సీ, ఎంబీఏ/ సీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కనీసం 3 నుంచి ఐదేండ్ల పని అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 20 నుంచి 45 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 9.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు రూ.175. ఇతర​అభ్యర్థులకు రూ.850. 
లాస్ట్ డేట్: ఏప్రిల్ 30.
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్​లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్​లైన్ ఎగ్జామ్​కు 70 శాతం, ఇంటర్వ్యూకు 30 శాతం వెయిటేజీ ఉంటుంది. 
ఆన్​లైన్ ఎగ్జామ్ తేదీ:  మే (తాత్కాలికం)
ఇంటర్వ్యూ తేదీ: జూన్ (తాత్కాలికం)
మరిన్ని వివరాలకు వెబ్ సైట్ centralbank.bank.inను సందర్శించండి. 
 

©️ VIL Media Pvt Ltd.