Reading Time: < 1 minute

ఐపిఎల్ 2026లో ఎట్టకేలకు చెన్నై బోణీకొట్టింది. సంజు శామ్‌సన్ సెంచరీతో చెలరేగగా.. బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. దీంతో లక్ష ఛేదనకు దిగిన ఢిల్లీని .. పరుగులకే కట్టడి చేశారు చెన్నై బౌలర్లు. దీంతో 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. 213 పరుగుల లక్ష ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లలో పాతుమ్ నిశాంక(41), ట్రిస్టన్ స్టబ్స్(60)లు రాణించినా.. మిగతా బాటర్లు రెండంకెల స్కోరు చేయలేకపోయారు. దాంతో ఢిల్లీ ఓటమిని మూటగట్టుకుంది.

సంజూ సెంచరీ..

ఈ మ్యాచ్లో టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (15) త్వరగానే ఔట్ అయ్యా డు. ఈ క్రమంలో సంజు శాంసన్, ఆయుష్ మాత్రేతో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. మ్యాచ్‌లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు సంజూ. మాత్రే 36 బంతుల్లో 59 పరుగులు చేసి, రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరగగా.. సంజు మాత్రం మరో ఎండ్‌లో దూకుడుగా ఆడుతూ ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 52 బంతుల్లోనే సెంచరీపూర్తి చేసిన సంజు.. ఈ సీజన్‌లో తొలి శతకం నమోదు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఐపిఎల్‌లో ఓవరాల్‌గా నాలుగోది కావడం విశేషం. ఇక చివరలో శివమ్ దూబే (20 నాటౌట్) కూడా వేగంగా ఆడడంతో చెన్నై స్కోర్ 200 దాటింది.