Reading Time: 2 minutes

‘తప్పు డు మాటలు మాట్లాడితే చెప్పు తెగుద్ది’ అంటూ మంత్రి సీతక్క ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రె స్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ పథకాలను జీర్ణించుకోలేక ప్రతిపక్షా లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని సీతక్క ఆరోపించారు. అవసరమైతే కోర్టులకు వెళ్లి పరువు న ష్టం దావాలు వేస్తామని తెలిపారు. అంగన్వాడీ సిబ్బందికి ఫోన్ల కొనుగోలు విషయంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలను ఆమె ఖండించారు. కేంద్రం సూచించిన నిబంధనల ప్రకారం పారదర్శకంగా టెండర్ ప్రక్రియ నిర్వహించామని చె ప్పారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు లెక్కలు చెప్తున్నాయన్నారు. మేడారం ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనులపై వచ్చిన విమర్శలను సీతక్క కొట్టిపారేశారు. మేడారం గద్దెల వద్ద జరిగిన ప్రమాదాన్ని రాజకీయంగా వాడుకోవడం సరికాదని పేర్కొన్నారు.

మంత్రి సీతక్కపై బురదజల్లితే ఊరుకోం: ఇందిరాశోభన్

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కపై ఇటీవల బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న అసత్యారోపణలను కాంగ్రెస్ సీనియర్ నేత ఇందిరాశోభన్ తీవ్రంగా ఖండించారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల టెండర్ల వ్యవహారంపై ఆమె గణాంకాలతో సహా శనివారం మీడియాకు వివరించా రు. బీఆర్‌ఎస్ నాయకుడు క్రిశాంక్ గత నెల రో జులుగా పొంతన లేని మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఇందిరాశోభన్ ధ్వజమెత్తా రు. గత నెలలో రూ.8 కోట్ల కుంభకోణం అన్న క్రి శాంక్, నిన్నటి ఇంటర్వ్యూలో రూ.30 కోట్లు అన డం, నెల తిరక్క ముందే ఆయన మాటల్లోనే పొం తన లేకపోవడం విడ్డూరమన్నారు.

కేంద్ర ప్రభు త్వ పథకమైన ‘పోషణ్ అభియాన్’ కింద మొత్తం 38,130 మొబైల్ ఫోన్ల కొనుగోలుకు 2025 న వంబర్‌లో టెండర్లు పిలిచారని ఇందిరాశోభన్ తెలిపారు. కేంద్రం నిర్దేశించిన ధర రూ.11,800 కాగా, తమ ప్రభుత్వం కేవలం రూ.11,650లకే ఫోన్లను కొనుగోలు చేసిందని వివరించారు. ఇం దులో ఫోన్ మాత్రమే కాకుండా పవర్ అడాప్టర్, యూఎస్బీ కేబుల్, ఇంటర్ఫేస్, డస్ట్ ప్రూఫ్ పౌచ్, మొబైల్ కేస్, స్క్రీన్ ప్రొటెక్టర్తో సహా రెండేళ్ల పాటు ’మొబైల్ డివైస్ మేనేజ్మెంట్’ అప్లికేషన్ వంటి ఆరు రకాల అదనపు సేవలు ఉన్నాయని తెలిపారు.

సైబర్ క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు

అంగన్వాడి మొబైల్స్ కొనుగోళ్లలో అవినీతి జరిగిందంటూ మంత్రి సీతక్కను లక్షంగా చేసుకుని బిఆర్‌ఎస్ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా జరుగుతున్న తప్పుడు ప్రచారంపై సైబర్ క్రైమ్ స్టేషన్లో అంబర్ పేట కాంగ్రెస్ నేత పాండు నాయక్ ఫిర్యాదు చేశారు. పదేపదే నిరాధార ఆరోపణలు చేస్తూ మంత్రి సీతక్క ప్రతిష్టకు భంగం వాటిల్లేలా వ్యవహరిస్తున్నారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.