
90 శాతం ఉత్తీర్ణతతో సంక్షేమ గురుకుల్లాలో ప్రథమ స్థానం
మన తెలంగాణ / హైదరాబాద్ : -ఇంటర్ ఫలితాల్లో బిసి గురుకుల విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. 90 శాతం ఉత్తీర్ణత సాధించడం ద్వారా సంక్షేమ గురుకులాల్లో బిసి గురుకులాలు ప్రథమ స్థానంలో నిలిచారు. సీనియర్ ఇంటర్‌లో బైపిసి విద్యార్థి శ్రియ (994), బి. హిమానీ(993), రాథోడ్ నందు(993), ఎంపిసిలో బి. మధు(994), శ్రీనిధి(994), సిఇసిలో శ్రీలత (981), ఎంఈసిలో జాహ్నవి (983), హెచ్ ఇసిలో రాజేశ్వరి (980) స్టేట్ ర్యాంకులు సాధించారు. -సీనియర్ ఇంటర్‌లో పది లోపు ర్యాంక్‌లు ఎంపిసిలో 97 మంది, బైపిసిలో 62 మంది విద్యార్థులు సాధించారు. -జూనియర్ ఇంటర్ లో 16మందిఎంపిసి విద్యార్థులు స్టేట్ ర్యాంక్ (468) సాధించగా బైపిసిలో 11మందివిద్యార్థులు 438 మార్కులు సాధించారు. సీనియర్ ఇంటర్‌ఫలితాల్లో 33 కాలేజీల్లో 100 శాతం ఉత్తీర్ణత, జూనియర్ ఇంటర్ లో 9 కాలేజీల్లో వందశాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ఇంటర్ ఫలితాల్లో బిసి గురుకుల విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించి రికార్డు సృష్టించారు.
గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది సీనియర్ ఇంటర్ లో ఏడు శాతం, జూనియర్ ఇంటర్ లో ఎనిమిది శాతం అధిక ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర సగటు ఉత్తర్ణీత (70.58 శాతం) కాగా బిసి గురుకుల విద్యార్థులు 90 శాతం ఉత్తీర్ణతతో రికార్డు సాధించారు. జూనియర్ ఇంటర్‌లో ఎంపిసిలో పి. ప్రవల్లిక (468), కె. వైష్ణవి (468)తో పాటు 15 మంది విద్యార్థులు, బైపిసిలో పి. రాఘవి (438), వి. హేమశ్రీ (438) మార్కులు సాధించారు. మహాత్మా జ్యోతి బా పూలే బిసి గురుకుల విద్యాసంస్థల సొసైటీ లోని 261 కాలేజీల నుండి 2025- 26 విద్యా సంవత్సరానికి జనరల్ కేటగిరీలో సీనియర్ ఇంటర్ – 12,035 మంది పరీక్షకు హాజరుకాగా 10,856 (90 శాతం), జూనియర్ ఇంటర్ లో 14,783 మందికి గాను 12,664 మంది (86 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ కోర్సులో ప్రథమ సంవత్సరం 191 కు 183 మంది (96 శాతం) ద్వితీయ సంవత్సరం 176 కు 172 మంది (98 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ కోర్సులో 98శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
వందశాతం ఉత్తీర్ణత సాధించిన కాలేజీలు
సీనియర్ ఇంటర్‌లో బాలికలు – 17, బాలురు – 16, మొత్తము – 33 కాలేజీలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. జూనియర్ ఇంటర్ లో బాలికలు – 5, బాలురు – 4, మొత్తము – 9 కాలేజీలు 100 శాతం ఫలితాలు సాధించాయి. ఒకేషనల్ కోర్సులో బాలికలు – 6, బాలురు – 2, మొత్తము – 8 కాలేజీలు వంద శాతం ఫలితాలు సాధించాయి. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో మహాత్మా జ్యోతి బా పూలే బిసి గురుకుల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులతో పాటు రాష్ట్ర సగటు ఉత్తీర్ణత 70.60 శాతం కంటే అధిక ఉత్తీర్ణత 90 శాతం సాధించి విజయభేరి మోగించారు. పది లోపు ర్యాంక్ లు ఎంపిసిలో (988/1000) కన్న ఎక్కువ వచ్చిన వారు 97 మంది, బైపిసిలో (985/1000) కన్న ఎక్కువ వచ్చిన వారు 62 మంది ఉన్నారు.
సీనియర్ ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు 12,211 కాగా వీరిలో 11,028 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో ఏ గ్రేడ్ (75 శాతం మార్కులు) సాధించిన విద్యార్థులు 8,490 బి గ్రేడ్ (60శాతం మార్కులు) 2,097. మంది సాధించారు. జూనియర్ ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు 14,974 కాగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు 12,847 మంది ఉన్నారు. పది లోపు ర్యాంకులు సాధించినవారు ఎంపిసిలో (460/470) కన్న ఎక్కువ వచ్చిన వారు 727మంది, బైపిసిలో (429/430) కన్న ఎక్కువ వచ్చిన వారు 459 మంది ఉన్నారు. వీరిలో ఏ గ్రేడ్ (75 శాతం మార్కులు) సాధించిన విద్యార్థులు 9,628, బి గ్రేడ్ (60శాతం మార్కులు) 2,360. సాధించారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను, ఫలితాలు సాధించిన బోధనా సిబ్బందిని బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మహాత్మా జ్యోతి బా పూలే బిసి గురుకుల విద్యాసంస్థల సోసైటీ కార్యదర్శి బి. సైదులు అభినందించారు.