Reading Time: 2 minutes
Asha Bhosle Top Telugu Songs List Tribute Legendary Singer

Asha Bhosle Telugu Songs: ప్రముఖ గాయని ఆశా భోస్లే (92) కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఏకంగా 8 దశాబ్ధాలుగా పాటలు పాడారామే. 1968లో పాలు- నీళ్లు సినిమాతో తెలుగులోకి ఆశా భోస్లే ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో Idhi Mouna Geetham పాట పాడారు. ఆశా భోంస్లే తెలుగులో పాడిన పాటలు తక్కువైనా, అన్నీ ఆల్-టైమ్ హిట్‌లుగా నిలిచాయి. చిన్నికృష్ణుడు, చందమామ, మౌనరాగం, సంప్రదాయం, ప్రేమకథ, మయూరి, ముత్తు వంటి సినిమాల్లో పాటలు పాడారు. 2007లో చందమామ సినిమాలో “నాలో ఊహలకు” పాట ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికీ ఈ మెలోడీ సాంగ్‌ను యూత్ తెగ ఇష్టపడతారు. ఎస్.వి. కృష్ణారెడ్డి సంగీత దర్శకత్వంలో వచ్చిన సంప్రదాయం మువీలోని “అందమైన వెన్నెలలో” పాటను ఆమె గాత్రంతో ఎంతో అందంగా మరిచారు. రామ్ గోపాల్ వర్మ సినిమా ప్రేమ లేఖలు (తెలుగు – డబ్బింగ్)లో సందీప్ చౌతా సంగీత సారధ్యంలో “కొత్తగా ఉన్నది” పాటను ఆమె ఎంతో వైవిధ్యంగా పాడారు. ఆశా భోస్లే తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, బెంగాలీ వంటి 20కి పైగా భాషల్లో 11,000కు పైగా పాటలు పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు.

READ MORE: PM Modi: ఏకమవ్వాలి.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరుతూ ఎంపీలకు ప్రధాని మోడీ లేఖ

ఇక ఆమె బెస్ట్ సింగర్‌గా రెండు జాతీయ అవార్డులు, 18 మహారాష్ట్ర స్టేట్ ఫిలిం అవార్డులు, 9 ఫిలింఫేర్ అవార్డులు సొంత చేసుకున్నారు. ఆశా భోస్లేకు 2000 ఏడాదిలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సైతం దక్కింది. 2008లో పద్మ విభూషణ్ అవార్డు సొంతం చేసుకున్నారు. మరాఠి సినిమాతో ఆశా భోస్లే అరంగేట్రం చేశారు. ఆమె పాడిన తొలి సినిమా మజా బల్. తొలిసారిగా 1948లో హిందీ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. చునారియా సినిమాలో తొలి సారి హిందీ పాట పాడారు. ఫస్ట్ సోలో సాంగ్ రాత్‌కీ కహాన(1942) కాగా.. 16 ఏళ్ల వయసులో గణపతిరావు భోస్లేతో వివాహం జరిగింది. కాగా.. 1980లో మ్యూజిక్ డైరెక్టర్ ఆర్డీ బర్మన్‌తో ఆశా భోస్లే రెండో వివాహం చేసుకున్నారు. రంగీలా మూవీలో తనహా.. తనహా, రంగీలా రే పాటలు పాడారు. లగాన్ మూవీలో రాధాకైసే నా జలే పాట పాడారు. మాయి మువీలో తొలిసారి నటించారు.