
సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్ యామినీ ఈఆర్‌ను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ ఉత్తర, ఆర్టిస్ట్ చిత్రాల దర్శకుడు రతన్ రిషి తెరకెక్కిస్తున్న చిత్రం ‘క్వీన్’. ఆదివారం యామినీ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ.. తన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో క్లాసికల్ డ్యాన్సర్‌గా అందంగా ముస్తాబైన యామిని.. ఆనందభాష్పాలతో కనిపించి ఆకట్టుకుంటోంది.
ప్రస్తుత సొసైటీతో ముడిపడి ఉన్న ఒక ఇంటరెస్టింగ్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు రతన్ రిషి. తను ప్రేమించిన వ్యక్తి కలను నిజం చేస్తూ… అతని కలకు చట్టబద్దమైన గుర్తింపు తీసుకొచ్చేందుకు ఒక అమ్మాయి ఎలాంటి పోరాటం చేసింది అనేది ఆద్యంతం ఆసక్తిని కలిగించనుందని దర్శకుడు చెప్పాడు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. వన్ సర్కిల్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాలకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ విలన్స్‌గా నటిస్తున్నారు.