Reading Time: 2 minutes
Virat Kohli Angry Reaction Video Rcb Vs Mi Ipl 2026 Highlights

Virat Kohli Angry: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ పోరు మైదానంలోనే కాక సోషల్ మీడియాలోనూ సెన్సేషన్ సృష్టిస్తోంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీకి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. హాఫ్ సెంచరీ చేసిన ఆనందం కంటే, అవుటైన తీరుపై కోహ్లీ ప్రదర్శించిన ఆగ్రహం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఐపీఎల్ 19వ సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తీవ్ర అసహనానికి గురయ్యాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాతి బంతికే అనూహ్య రీతిలో అవుటవడంతో, మైదానంలోనే తన కోపాన్ని ప్రదర్శించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

READ ALSO: Trump Warns China: డ్రాగన్ దేశానికి ట్రంప్ వార్నింగ్.. ఇరాన్‌కు సాయం చేస్తే చైనాపై 50% టారిఫ్ విధిస్తామని హెచ్చరిక!

అసలేం జరిగిందంటే..
ఈ మ్యాచ్‌లో కోహ్లీ 38 బంతుల్లో 50 పరుగులు (5 ఫోర్లు, 1 సిక్సర్) చేశాడు. 37 బంతుల్లో నిలకడగా ఆడి ఫిఫ్టీ పూర్తి చేసుకున్న కింగ్, ఆ తర్వాతి బంతిని భారీ షాట్‌గా మలచాలని ప్రయత్నించాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఫుల్ టాస్ బంతిని హిట్ చేసే క్రమంలో కోహ్లీ బ్యాట్ చేతిలో తిరగడంతో టైమింగ్ మిస్ అయ్యింది. దీంతో బంతి నేరుగా లాంగ్-ఆన్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ చేతుల్లోకి వెళ్లింది. మంచి ఫామ్‌లో ఉండి, భారీ స్కోరు దిశగా వెళ్తున్న క్రమంలో ఇలా అవుటవడాన్ని కోహ్లీ జీర్ణించుకోలేకపోయాడు. పెవిలియన్ వైపు వెళ్తూ తీవ్ర నిరాశతో తన గ్లౌజులను విసిరేయడమే కాకుండా, హెల్మెట్‌ను నేలకేసి కొట్టాడు. తన ఇన్నింగ్స్‌ను ఫినిషర్ రోల్‌లో ముగించలేకపోయానన్న కసి అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది.

పాటిదార్, సాల్ట్ మెరుపులు.. ఆర్‌సీబీ భారీ స్కోరు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ బ్యాటర్లు ముంబై బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. ఫిల్ సాల్ట్ విధ్వంసకరమైన బ్యాటింగ్‌తో కేవలం 36 బంతుల్లోనే 78 పరుగులు చేసి ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సాల్ట్ అవుటయ్యాక వచ్చిన పాటిదార్ మరింత విధ్వంసం సృష్టించాడు. కేవలం 20 బంతుల్లో 53 పరుగులు (5 సిక్సర్లు, 4 ఫోర్లు) చేసి స్కోరు బోర్డును జెట్ స్పీడ్‌తో పరుగులు పెట్టించాడు. చివర్లో వచ్చిన టిమ్ డేవిడ్ కేవలం 16 బంతుల్లో 34 పరుగులు చేయడంతో ఆర్‌సీబీ నిర్ణీత ఓవర్లలో 240 పరుగుల భారీ స్కోరును సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కేవలం 222 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 18 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ చేతిలో ఓడిపోయింది.

READ ALSO: RCB vs MI: సాల్ట్ ‘పవర్’.. పాటిదార్ ‘స్పీడ్’.. కోహ్లీ ‘క్లాస్’.. వాంఖడేలో ఆర్‌సీబీ విధ్వంసం!