Reading Time: < 1 minute

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 18 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో ముంబై నాలుగు మ్యాచులు ఆడగా.. కేవలం 1 మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. దీంతో టేబుల్‌లో ఎనిమిదో స్థానంలో ఉంది. అయితే ఆర్సిబితో ఓటమి తర్వాత ముంబై కెప్టెన్ హార్థిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘‘మా జట్టు త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. బౌలింగ్‌లోనూ ఎక్కువ పరుగులు సమర్పించుకున్నాం. ఈ విషయాల్లో మేం మెరుగవ్వాల్సి ఉంది. గత రెండు, మూడు మ్యాచుల్లో మేం బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో ఆశించిన మేరకు రాణించలేకపోయాం’’ అని హార్థిక్ అన్నాడు. రాబోయే రోజుల్లో తమ జట్టులో మార్పులు ఉండే అవకాశం ఉందని పాండ్యా హింట్ ఇచ్చాడు. ‘‘ప్రస్తుతం మేం చాలా ఎంపికలను విశ్లేషించాల్సి ఉంది. తర్వాత జరగబోయే మ్యాచుల్లో తప్పకుండా జట్టు కూర్పులో మార్పులు చేసే అంశాన్ని పరిశీలిస్తాం. అలాగే పవర్‌ప్లేలో మరిన్ని ఎక్కువ పరుగులు సాధించాలి. నిన్నటి మ్యాచ్‌లో రూథర్‌ఫోర్డ్ పోరాటం జట్టుకు ఎంతో ఉపయోగపడింది. అతడు టీమ్‌కు అదనపు బలం’’ అని పేర్కొన్నాడు.