Reading Time: < 1 minute

ఇంటర్ ఫలితాల్లో ‘శివాని’ ప్రభంజనం : కాలేజ్ చైర్మన్ తాళ్లపల్లి స్వామి గౌడ్

Caption of Image.

హసన్ పర్తి, వెలుగు: ఇంటర్ ఫలితాల్లో శివాని కళాశాల ప్రభంజనం సృష్టించిందని కాలేజ్​ చైర్మన్ తాళ్లపల్లి స్వామి గౌడ్ తెలిపారు. ఆదివారం అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది. సెకండియర్ ఎంపీసీలో నేరళ్ల రిషిత 995 మార్కులు సాధించగా, లకుంట్ల చక్రిక 994, ఆళ్లకుంట్ల నవ్య 994, కనకం రంజిత్ 994, బీపీసీలో పొడగంటి సహస్ర శ్రీ 995 మార్కులు సాధించారు. 

ఎంపీసీ ఫస్టియర్ లో మేకల శ్రావ్య 468, బీన వేణి అఖిలేశ్​యాదవ్ 467, పాక రక్షిత 466, బీపీసీలో తాళ్లపల్లి వర్షిత 437, బుద్దే వైష్ణవి 436, సీఈసీలో గుండెబోయిన అజయ్ 485 మార్కులు సాధించారని చైర్మన్ స్వామి గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం సురేందర్ రెడ్డి, చంద్రమోహన్, రాజు రమేశ్, ​మురళీధర్, సురేశ్, ​సంతోష్ రెడ్డి  పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.