
చాలామంది డ్రైవింగ్, జాగింగ్ చేస్తూ, బైక్‌పై వెళ్తూ మ్యూజిక్ వినాలి, కాల్స్ మాట్లాడాలి అనుకుంటారు. కానీ.. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే చెవులు బ్లాక్ అయ్యి, వెహికల్స్ సౌండ్స్ వినిపించవు. అలాంటివాళ్లు ఈ స్మార్ట్ గ్లాసెస్‌ని ట్రై చేయొచ్చు.
దీన్ని పీట్రాన్ అనే కంపెనీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ స్టైలిష్ స్మార్ట్ గ్లాసెస్‌లో ఓపెన్–ఇయర్ ఎయిర్ కండక్షన్ ఆడియో ఫీచర్ ఉంది. అది బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇందులోని 10ఎంఎం డ్రైవర్ల ద్వారా ఇయర్ స్పీకర్లు పెట్టుకోకుండానే స్టీరియో సౌండ్ వినిపిస్తుంది. దాంతోపాటే ఇతర సౌండ్స్ (ట్రాఫిక్, హార్న్స్) వినిపిస్తాయి.
►ALSO READ | షాక్ ప్రూఫ్ బాడీతో 3 పిన్ ప్లగ్ ట్రావెల్ అడాప్టర్..
బిల్ట్– ఇన్ హెచ్‌డీ మైక్‌తో కాల్స్ కూడా మాట్లాడొచ్చు. దీని బరువు కేవలం 34 గ్రాములు మాత్రమే. అద్దాలు యూవీ ప్రొటెక్షన్‌తో వస్తాయి. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే దాదాపు 8 గంటలసేపు పాటలు వినొచ్చు. మాగ్నెటిక్ టచ్ చార్జింగ్ టెక్నాలజీతో 1.5 గంటల్లో ఫుల్ చార్జ్ అవుతుంది. దీనికి ఈజీ టచ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి.
1,499