Reading Time: < 1 minute

హనుమకొండలో భారీ అగ్ని ప్రమాదం.. తగలబడి పోయిన ప్లాస్టిక్ స్టోరేజ్ షాప్

Caption of Image.

హనుమకొండలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 2026 ఏప్రిల్ 12వ తేదీన హనుమకొండలోని కిషన్ పురలో అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ భద్రపరిచే షాప్ లో ఫైర్ యాక్సిడెంట్ తో మంటలు భారీగా చెలరేగాయి. దట్టమైన పొగలకు కిషన్ పుర అంతా మబ్బులు కమ్మేసిన పరిస్థితి కనిపించింది.

ప్లాస్టిక్ ఎక్కువగా ఉండటంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి.  ఘటనను గమనించన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచరం అందించారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బందితో పాటు చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. మంటలను అదుదపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

►ALSO READ | అసలే గ్యాస్ కొరత.. అందులో ఈ ప్రమాదం ఒకటి.. సంగారెడ్డిలో పేలిన సిలిండర్

©️ VIL Media Pvt Ltd.