Reading Time: < 1 minute
Sreeleela Krithi Shetty Struggles In Kollywood Parashakti Lic Flops

టాలీవుడ్‌లో ఒకప్పుడు వెలిగిపోయిన హీరోయిన్లు ఇతర భాషల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవడం సహజం. అయితే, ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ బ్యూటీలు శ్రీలీల, కృతి శెట్టిలకు మాత్రం ఎక్కడా సక్సెస్ దొరకడం లేదు. తెలుగులో వరుస ప్లాపులు పలకరించడంతో కోలీవుడ్‌లో పాగా వేయాలని చూసిన ఈ ముద్దుగుమ్మలకు అక్కడ కూడా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి.

Also Read: Bharatavarsha: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న గోపీచంద్ ‘భరతవర్ష’.. టైటిల్ గ్లింప్స్!

మాస్ రాజా రవితేజ ‘ధమాకా’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన శ్రీలీల, ఆ తర్వాత తెలుగులో చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఆమె ఆశలన్నీ శివకార్తికేయన్ సరసన నటించిన తమిళ చిత్రం ‘పరాశక్తి’ మీదే పెట్టుకుంది. ఈ సినిమాతో కోలీవుడ్‌లో బిజీ అయిపోవచ్చని భావించిన శ్రీలీలకు నిరాశే ఎదురైంది. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడమే కాకుండా, ఆమెకు అక్కడ రావాల్సిన అవకాశాలను కూడా దెబ్బతీసింది. ఇక మరోవైపు ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఈ ఏడాది జనవరిలో ‘అన్నగారు వస్తారు’ సినిమాతో ప్లాప్ అందుకున్న కృతి, తాజాగా ప్రదీప్ రంగనాథన్ సరసన నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIC) పై భారీ అంచనాలు పెట్టుకుంది. కానీ, ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో తెలుగులో పోయిన క్రేజ్‌ను తమిళంలో సంపాదించుకుందామనుకున్న కృతి ప్లాన్ రివర్స్ అయ్యింది.

అయినప్పటికీ, ఈ ఇద్దరు భామలు ఇంకా రేసులో ఉన్నారు. కృతి శెట్టి ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ సరసన నటిస్తున్న మల్టీస్టారర్ సినిమాపై ఆశలు పెట్టుకుంది. మరోవైపు, శ్రీలీల కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సరసన ఒక క్రేజీ ప్రాజెక్ట్‌లో అవకాశం దక్కించుకుంది. మరి ఈ రెండు సినిమాలైనా వీరిద్దరికీ సాలిడ్ హిట్ ఇచ్చి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాయో లేదో చూడాలి!