మేషం: ఈ రాశికి అక్షయ తృతీయ రోజున ధన స్థానంలో చంద్రుడు ఉచ్ఛపట్టడం వల్ల అనేక విధాలుగా సంపద పెరుగుతుంది. పూర్తి స్థాయిలో లక్ష్మీ యోగం పడుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ దినదినాభి వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అదృష్టం బాగా కలిసి వస్తుంది. చాలా కాలంగా పెండింగులో ఉన్న శుభ కార్యాలు ఇక నుంచి జరిగే సూచనలున్నాయి. అనేక సమస్యలు, ఒత్తిళ్లు, ఆందోళనల నుంచి బయటపడతారు.
వృషభం: అక్షయ తృతీయ రోజున వృషభ రాశిలో చంద్రుడు ఉచ్ఛపడుతున్నందువల్ల ఈ రాశివారి ప్రాభవం, వైభవం అనేక విధాలుగా పెరిగే అవకాశం ఉంది. ఆ రోజున చేపట్టిన కార్యక్రమాలు, ప్రయత్నాలు తప్పకుండా విజయవంతం అవుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఒక ప్రముఖుడుగా గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో స్థాయి, హోదా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట, అభివృద్ది బాటపడతాయి.
కర్కాటకం: ఈ రాశినాథుడైన చంద్రుడు లాభ స్థానంలో ఉచ్ఛ పట్టడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా ప్రాధాన్యం పెరుగుతుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, చేపట్టే కార్యక్ర మాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి. అనేక మార్గాల్లో సంపద పెరుగుతుంది. సామాన్య స్థితిలో ఉన్నవారు సైతం ఉచ్ఛ స్థితికి చేరుకునే అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారమవుతుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక స్థితి బాగా మెరుగవుతుంది.
కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో చంద్రుడికి ఉచ్ఛ స్థితి కలగడం వల్ల అక్షయ తృతీయ ఈ రాశివారి జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. రాజయోగాలు, ధన యోగాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఐశ్వర్యవంతులయ్యే అవకాశముంది. విదేశీ సొమ్ము అనుభవించే అవకాశం కూడా ఉంది. అనేక విధాలుగా పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలతో పాటు సామాజికంగా కూడా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఆస్తిపాస్తులు కలిసి వచ్చే సూచనలున్నాయి.
వృశ్చికం: ఈ రాశివారికి అక్షయ తృతీయ రోజున సప్తమ స్థానంలో చంద్రుడు ఉచ్ఛ స్థితిలో ఉంటున్నందు వల్ల ఎటువంటి ఆర్థిక ప్రయత్నమైనా కలిసి వస్తుంది. ధనపరంగా మనసులోని కొన్ని కోరికలు నెరవేరుతాయి. జీవిత భాగస్వామికి కూడా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. రావలసిన సొమ్ము తప్పకుండా చేతికి అందుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. సంపన్న వ్యక్తితో వివాహం కుదురుతుంది.
మకరం: ఈ రాశికి అక్షయ తృతీయ రోజున పంచమ స్థానంలో చంద్రుడు ఉచ్ఛ స్థితికి రావడం వల్ల అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకే కాకుండా, ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందుతాయి. ఆర్థిక ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆస్తి ఒప్పందాలు కుదురుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. ఆశించిన శుభ వార్తలు వింటారు.





