కావలసిన పదార్థాలు: అర కిలో చికెన్, రెండు కప్పుల మజ్జిగ, రెండు ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి, రెండు టమాటాలు , ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , అర టేబుల్ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ గరం మసాలా, నాలుగు కరివేపాకు ఆకులు, మూడు టేబుల్ స్పూన్స్ నూనె, అర టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర , రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా కొత్తిమీరను తీసుకోవాలి.
మీరు ముందుగా గ్యాస్ వెలిగించి దాని మీద పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి దానిలో కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి ఆ తర్వాత నాలుగు కరివేపాకు ఆకులు వేసి బాగా వేయించుకోవాలి. కట్ చేసిన ఉల్లిపాయలను వేసి, పచ్చిమిర్చి వేసి మీడియం మంటపై ఉంచాలి.
ఉల్లిపాయలు గోల్డ్ కలర్లోకి మారిన తర్వాత మారి వరకు వేయించాలి. కొద్దీ సేపటి తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. పచ్చివాసన పోయే వరకు సన్నని మంట మీద ఉంచాలి.
ఇక ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడి వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఆ మసాలా చికెన్‌కు బాగా పట్టించాలి.
చికెన్ బాగా ఉడికిన తర్వాత, మజ్జిగను పోసి మీడియం మంట మీద ఉంచాలి. ఇలా స్టవ్ మీదే 10 నిమిషాల పాటు ముక్కలను మగ్గనివ్వండి. చివర్లో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, కొత్తిమీర వేసి 5 నిమిషాల పాటు స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే,భీమవరం స్టైల్ చికెన్ మజ్జిగ పులుసు రెడీ.




