
ఉదయం 9 గంటలకే భగ్గుమంటున్న సూర్యుడు రాష్ట్రంలో 40డిగ్రీలు
దాటిన ఉష్ణ్రోగ్రతలు మధ్యాహ్నం నిర్మానుష్యంగా మారుతున్న రోడ్లు
ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారుతోంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం పలు జిల్లాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ఎండ తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఎండ తీవ్రతకు తోడు వేడి, ఉక్కపోత అధికంగా ఉండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆదివారం జిల్లాల వారీగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలీవిధంగా ఉన్నాయి. ఆదిలాబాద్ (40.3 డిగ్రీలు), భద్రాచలం (39.6 డిగ్రీలు), హన్మకొండ (37.5 డిగ్రీలు), హైద రాబాద్ (39.4 డిగ్రీలు), ఖమ్మం (39.8 డిగ్రీలు), మహబూబ్‌నగర్ (40.5 డిగ్రీలు), మెదక్ (39.9 డిగ్రీలు), నల్గొండ (37.8 డిగ్రీలు), నిజామా బాద్ (40.7 డిగ్రీలు), రామగుండం (39.0 డిగ్రీలు), హయత్‌నగర్ (37.6 డిగ్రీలు), పటాన్‌చెరు (38.0 డిగ్రీలు), రాజేంద్రనగర్ (38.5 డిగ్రీలు) మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేసవి ప్రారంభంలోనే ఇలా ఉంటే ముందు ముందు పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని ఆందోళన చెందుతు న్నారు. ఉదయం 9 గంటలకే ఎండ వేడిమి అధికం కావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. అతి ముఖ్య మైన పని ఉంటేనే బయటకు వస్తున్నారు.ఈ నేపథ్యంలో మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. శుక్రవారం నాటికే రాష్ట్రంలోని 27 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత పెరగనున్న నేపథ్యం లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. మధ్యా హ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని హితవు పలికింది. ముఖ్యంగా వృద్ధులు, గర్భి ణులు, చిన్నారుల విష యంలో మరింత జాగ్రత్త అవస రమని సూచించింది. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే వడదెబ్బ తగలకుండా తలపాగా, గొడుగు వంటివి వాడా లని, తరచూ నీరు, ద్రవ పదార్థా లు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
ఎపిలోనూ అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు
అటు ఎపిలో ఇప్పటికే భానుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. శనివారం కడప జిల్లాలో గరిష్టంగా 44.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 200కు పైగా మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడప జిల్లా కొండాపురం మండలం పొట్టిపాడులో అత్యధికంగా 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 44.3 డిగ్రీలుగా రికార్డయింది. రాయలసీమ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఆదివారం పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చింది. కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాలులు వీస్తాయని, మొత్తం 93 మండలాల్లో వీటి ప్రభావం ఉంది. హీట్ వేవ్‌తో పాటు ఉక్కబోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఎండ మొదలవుతోంది. 10 గంటల తర్వాత ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుండగా ప్రజలకు బయటకు రావాలంటేనే భయపడు తున్నా రు. దీంతో ఇళ్లల్లోనే ఉంటున్నారు. వచ్చే రెండు నెలల పాటు ఇటువంటి పరిస్థితులే ఉండనున్నాయి.