Reading Time: < 1 minute

ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ సంజూ శాంసన్ కతకంతో కదం తొక్కాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేపట్టిన చెన్నైకి శుభారంభం దక్కింది. సంజూ భారీ షాట్లతో చెలరేగాడు. గత మూడు మ్యాచుల్లో విఫలమైన సంజూ.. ఢిల్లీపై విరుచుకుపడ్డాడు. దీంతో 56 బంతుల్లోనే 15 ఫోర్లు, 4 సిక్సులతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆయూష్ మాత్రే(59) రిటైర్డ్ ఔట్ గా వెనుదిరిగాడు. చివర్లో శివమ్ దూబే(20 నాటౌట్) రాణించాడు.దీంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగుల భారీ స్కోరు చేసింది.