Reading Time: < 1 minute

లక్నో: ఐపిఎల్ 19వ జీజన్‌లో ఏకనా స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింగ్స్ బ్యాటింగ్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన లక్నో.. ఆరంభంలో వేగంగా ఇన్నింగ్స్ ఆడినా.. గుజరాత్ బౌలర్లు కట్టడి చేస్తూ వచ్చారు. దీంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. లక్నో బ్యాటింగ్‌లో మార్క్‌రమ్ 30, పూరన్ 19, పంత్, సమాద్, ముకుల్ తలో 18 పరుగులు చేశారు. గుజరాత్ బౌలింగ్‌లో ప్రసిద్ధ్ 4, అశోక్ 2, రబాడా, సిరాజ్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే.. గుజరాత్ 165 పరుగులు చేయాలి.