
ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫు్లయెన్సర్ యామినీ ఈఆర్‌ను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రతన్ రిషి హీరోయిన్ సెంట్రిక్ కథతో ‘క్వీన్‘ మూవీని రూపొందిస్తున్నారు. ఈ సినిమాను వన్ సర్కిల్ ఫిలింస్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో కాళకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ విలన్స్‌గా నటిస్తున్నారు. ఈ మూవీలో ఎంతో స్పెషల్‌గా, ఆసక్తికరంగా ఉండే హీరోయిన్ తండ్రి పాత్రలో 90వ దశకం హీరోల్లో ఒకరు నటించబోతున్నారు. ఆదివారం హీరోయిన్ యామినీ ఈఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విశెస్ చెబుతూ ‘క్వీన్’ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో క్లాసికల్ డాన్సర్ గెటప్‌లో అందంగా ముస్తాభైన యామిని, ఆనందభాష్పాలతో కనిపించి ఆకట్టుకుంటోంది. ప్రస్తుత సమాజంతో ముడిపడి ఉన్న ఒక ఆసక్తికర లవ్ స్టోరీని ఈ చిత్రంలో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రతన్ రిషి. తను ప్రేమించిన వ్యక్తి కలను నిజం చేస్తూ.. అతని కలకు చట్టబద్దమైన గుర్తింపు తీసుకొచ్చేందుకు ఒక అమ్మాయి ఎలాంటి పోరాటం చేసింది అనేది ఈ చిత్రంలో ఆద్యంతం ఆసక్తిని కలిగించనుంది. ‘క్వీన్’ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.