
శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి, అన్నయ్య, ప్రేమ కోసం, శివ రామరాజు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో అలరించిన హీరో వెంకట్ సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇస్తున్నారు. విఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో వెంకట్ హీరోగా రూపొందుతున్న మాస్ కమర్శియల్ ఎంటర్ టైనర్ ‘హరుడు’. రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. సమ్మర్ స్పెషల్ గా మే 8న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో హీరో వెంకట్ మాట్లాడుతూ “దర్శకుడు రాజ్ తాళ్లూరి అద్భుతంగా సినిమాను తీశారు. ఈ సినిమాలో ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. మణి జిన్న అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఇది మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్”అని అన్నారు. డైరెక్టర్ రాజ్ తాళ్లూరి మాట్లాడుతూ “‘ఈ సినిమా కోసం వెంకట్ ప్రాణం పెట్టి పనిచేశారు. హెబ్బా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తుందని నమ్ముతున్నాను”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్, చంద్ర మహేష్, మణి జిన్న, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.