Reading Time: < 1 minute
Kiran Abbavaram Is Showing His Talent By Doing Multitasking In Tollywood

టాలీవుడ్‌లో మల్టీటాస్క్స్ చేస్తూ.. టాలెంట్ చూపిస్తున్న కిరణ్ అబ్బవరం.. పాన్ ఇండియా లీగ్‌లోకి ఎంటరౌతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ అండ్ ప్రేరణ అరోరా ప్రొడక్షణ్ హౌస్ సంయుక్తంగా ఓ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించబోతున్నాయి. మైథలాజికల్ సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం ఫిక్స్ అయ్యాడు.

Also Read : Abhilash : ‘బైకర్’ డైరెక్టర్ అభిలాష్‌కు అడ్వాన్స్ ఇచ్చిన భారీ చిత్రాల నిర్మాత

కిరణ్ అబ్బవరం 15వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది ఈ ఫిల్మ్‌కు కీర్తన్ దర్శకుడు. ఈ ఏడాది అక్టోబర్ నుండి మూవీ ప్రారంభం కాబోతోందట. వచ్చే ఏడాది రిలీజ్ కాబోతోంది ఈ విజువల్ వండర్ ఫిల్మ్. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ నటించబోతోందని వార్తలొస్తున్నాయి. అయితే పాన్ ఇండియా హీరోగా నిరూపించుకోవాలని మిడ్ రేంజ్ హీరోలు ట్రై చేసి చతికిల పడుతున్న టైంలో పెద్ద రిస్క్ చేస్తున్నాడు కిరణ్. డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో అలరిస్తోన్న కిరణ్ అబ్బవరం.. మల్టీటాస్క్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం చెన్నై లవ్ స్టోరీతో బిజీగా ఉన్న కిరణ్ అబ్బవరం.. ఇటు నిర్మాతగానూ కొత్త బాధ్యతలు తీసుకున్నాడు. తిమ్మరాజు పల్లి టీవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే డిజిటల్ ఎంట్రీకి సిద్ధమౌతున్నాడు. డియర్ కామ్రేడ్ ఫేం భరత్ కమ్మ దర్వకత్వంలో గువ్వల చెరువు ఘాట్ రోడ్ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఇది పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ప్రైమ్‌లో త్వరలో ప్రీమియర్ కాబోతోంది. తన ఓన్ డైరెక్షన్‌లో మూవీస్ ప్లాన్ చేసుకుంటున్న హీరో. రియాలిటీ అనే మూవీతో కెమెరా పట్టబోతున్నాడట.