గోధుమ రొట్టె : మనం భారతీయుల్లో ఎక్కువ మంది తినేది ఇదే రొట్టే. మిగిలిన వాటితో పోలిస్తే ఇది కొంచెం త్వరగా జీర్ణమవుతుంది. అయితే ఇందులో గ్లూటెన్ ఉండటం వల్ల, అలర్జీ ఉన్నవారికి జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు. సాధారణ జీర్ణక్రియ ఉన్నవారికి ఇది సుమారు 2.5 నుండి 3 గంటల్లో అరిగిపోతుంది.
మల్టీగ్రేన్ రొట్టె: జొన్నలు, సజ్జలు, గోధుమలు వంటి పలు రకాల ధాన్యాల మిశ్రమంతో చేసిన పిండితో ఈ రొట్టెలను తయారు చేస్తారు. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణం కావడానికి పట్టే సమయం మనం కలిపే ధాన్యాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ రొట్టే అరగడానికి సగటున ఇది 3 నుండి 4 గంటలు తీసుకుంటుంది.

మొక్కజొన్న రొట్టె : మొక్కజొన్న రొట్టెలో గ్లూటెన్ ఉండదు, కానీ ఇది స్వతహాగా కొంచెం బరువైన ఆహారం. జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారికి ఇది అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది కూడా జీర్ణం కావాడానికి సుమారు 3 నుండి 4 గంటల సమయం తీసుకుంటుంది.
మొత్తాన్ని మిగతా వాటితో పోల్చుకుంటే గోధుమ రొట్టెనే కాస్తా త్వరగా జీర్ణమవుతుంది. కానీ మీకు గ్లూటెన్ సమస్య ఉంటే లేదా బరువు తగ్గాలనుకుంటే రాగి లేదా మల్టీగ్రేన్ రొట్టెలు ఉత్తమం. మీ శరీర తత్వాన్ని బట్టి సరైన రొట్టెను ఎంచుకోవడం ఆరోగ్యానికి మంచిది.