Reading Time: < 1 minute

అమెరికాలో విజయనగరం టెకీ మృతి.. మూడు నెలల క్రితమే జాబ్ వచ్చింది.. పాపం పుట్టిన రోజే..

Caption of Image.

ఎన్నో కలలతో అమెరికా వెళ్లాడు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం సంపాదించాడు. జాబ్ వచ్చి మూడు నెలలే అవుతోంది. తమ కొడుకుకు జాబ్ వచ్చిందన్న ఆనందం ఈ తల్లిదండ్రులకు కొద్ది రోజులు కూడా మిగలకుండానే ఊహించని విషాదం జరిగింది. పుట్టిన రోజే మృత్యు కుహరంలోకి చేరుకున్న విజయనగరం టెకీ మరణ వార్త తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. 

వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలో విజయనగరం సాఫ్ట్ వేర్ ఉద్యోగి సింగిరెడ్డి సాయి శ్రీహరికృష్ణ పుట్టిన రోజే కన్నుమూశాడు. 2026 ఏప్రిల్ 11 న స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలు చేసుకునేందుకు జలపాతం దగ్గరకు వెళ్లారు. సరదాగా స్నానం చేసేందుకు జలపాతంలో దిగగా.. ఈత రాకపోవడంతో జలపాతంలో మునిగి మరణించాడు. 

►ALSO READ | తిరుచానూరులో అమ్మవారి భక్తులపై అరాచకం..పార్కింగ్ పేరుతో అక్రమ వసూళ్లు.. న్యాయవాదిపై దాడి.!

శ్రీహరికృష్ణ స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పిరిడి గ్రామం. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన హరికృష్ణ విగతజీవిగా మారడం ఆ కుటుంబం జీర్ణించుకోలేక పోతోంది. మంచి ఉద్యోగంతో బాగా సెటిల్ అవుతాడనుకున్న తమ కుమారుడు చనిపోవడంతో గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. శ్రీహరికృకష్ణ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

©️ VIL Media Pvt Ltd.