Reading Time: < 1 minute

మన బాధ జనం బాధ అనుకుంటే జనం నమ్మరు.. కవితకు పరోక్షంగా చురకలంటించిన కేటీఆర్ !

Caption of Image.

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో చిట్చాట్ చేశారు. తన సోదరి కవిత కొత్త పార్టీ ఆలోచనపై కేటీఆర్ ఈ చిట్ చాట్లో సెటైర్లు పేల్చారు. కొత్త పార్టీలు ఎన్ని వస్తే అంత మంచిదేనని, కానీ జనం ఓట్లు వేయవద్దా అని కేటీఆర్ ప్రశ్నించారు. మన బాధ జనం బాధ అనుకుంటే జనం నమ్మరని కవితకు కేటీఆర్ పరోక్షంగా చురకలంటించారు. తమకు ఏ పార్టీతో పొత్తులు, సర్దుబాటులు ఉండబోవని కేటీఆర్ స్పష్టం చేశారు. చంద్రుడు తాత్కాలికంగా మబ్బుల సాటుకు పోయాడని, మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

తాము తప్పులు చేశామని, అందుకే ఓడిపోయామని కేటీఆర్ అంగీకరించారు. బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్లతో చెట్టాపట్టాలు వేసుకుంటున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని.. 179 అసెంబ్లీ స్థానాలకు తెలంగాణలో నియోజకవర్గాలు పెరుగుతాయని డీలిమిటేషన్ గురించి కేటీఆర్ వివరించారు. 25 ఎంపీ స్థానాలు, 60 ఎమ్మెల్సీలు పెరుగుతాయని చెప్పారు. ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ కూడా వచ్చే అవకాశం ఉందని.. ఎన్ని స్థానాలు పెరిగినా తమకు సరిపడా నాయకులు ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. 

►ALSO READ | టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారాక నష్టపోయాం: కేటీఆర్

ఇదిలా ఉండగా.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటుకు ఇప్పటికే ముహూర్తం ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్​25న కవిత పార్టీని అధికారికంగా ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే. ధర్మగంటను పార్టీ గుర్తుగా ఎన్నికల కమిషన్కు అప్లికేషన్​పెట్టుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. కవిత కొత్త పార్టీ ఏర్పాటుకు ముమ్మర కసరత్తు చేస్తున్న క్రమంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.

©️ VIL Media Pvt Ltd.