
CSK vs DC controversy: నిన్న(శనివారం) చెన్నై సూపర్ కింగ్స్(CSK), ఢిల్లీ క్యాపిటల్స్(DC) మధ్య చైన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై ఘన విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్ మధ్యలో భారీ వివాదం అందరినీ ఆశ్చర్యపరిచింది. 213 భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఢిల్లీ బరిలోకి దిగింది. ఈ సమయంలో జట్టు కోచ్ హేమంగ్ బదానీ, బ్యాటర్లు నితీష్ రాణా, కరుణ్ నాయర్ అంపైర్లతో వాగ్వాదానికి దిగారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అక్కడ అసలు ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇంతలో కామెంటరీ బాధ్యతలు చేపట్టిన సీఎస్‌కే మాజీ బ్యాటర్ ఫాఫ్ డు ప్లెసిస్ ఈ అంశంపై వివరణ ఇచ్చాడు. ఢిల్లీ ప్లేయర్ ట్రిస్టన్ స్టబ్స్‌ను గ్లౌజులు మార్చుకోవడానికి అనుమతించకపోవడంతో డీసీ శిబిరం అసంతృప్తికి గురైందని వెల్లడించాడు.
READ MORE: Jagtial: భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తపై అల్లుడు దారుణం..
అసలు ఏం జరిగిందంటే..?
19వ ఓవర్‌లో క్రీజులో ఉన్న ట్రిస్టన్ స్టబ్స్ తన గ్లౌవ్స్ మార్చుకోవాలని భావించాడు. గ్లౌవ్స్ తీసుకొచ్చేందుకు సైగ చేశాడు. చెమటతో తడిసిన గ్లౌజుల వల్ల అతని పట్టు దెబ్బతినడంతో అసౌకర్యంగా కనిపించాడు. కానీ.. ఈ అభ్యర్థనను ఫోర్త్ అంపైర్ తిరస్కరించారు. దీంతో ఒక్కసారిగా గందరగోళం మొదలైంది. గ్లౌవ్స్ మార్చుకోనివ్వలేదన్న అసహనంతో ఉన్న స్టబ్స్, సరిగ్గా ఆ మరుసటి బంతికే అవుట్ అయ్యాడు. 38 బంతుల్లో 60 పరుగులు చేసి ఢిల్లీ ఆశలను సజీవంగా ఉంచిన స్టబ్స్ అవుట్ కావడంతో ఢిల్లీ ఓటమి ఖాయమైంది. జేమీ ఓవర్‌టన్ బౌలింగ్‌లో మిడ్-ఆఫ్ మీదుగా బంతిని కొట్టే ప్రయత్నంలో స్టబ్స్ అవుటయ్యారు. ఆ క్యాచ్‌ను నూర్ అహ్మద్ అందుకున్నాడు. స్టబ్స్ వెనుదిరిగి వెళ్తూ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లే దారిలో తన బ్యాట్, గ్లోవ్స్‌ను విసిరేశాడు. ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఢిల్లీ క్యాంప్ అంపైర్లతో వాదించిన దృశ్యాలు, స్టబ్స్ వీడియోలు వైరల్ అయ్యాయి.
అంతకుముందు, ఛేదనలో ఢిల్లీకి ఓపెనర్లు కేఎల్ రాహుల్, పాతుమ్ నిస్సంక (41) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. కేవలం 5 ఓవర్లలోనే 61 పరుగులు రాబట్టి రాజస్థాన్‌ను భయపెట్టారు. అయితే, నిస్సంక అవుట్ కావడంతో ఢిల్లీ జోరు తగ్గింది. అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో నిస్సంక ఇచ్చిన క్యాచ్‌ను ఖలీల్ అహ్మద్ వదిలేసినా, ఆ మరుసటి బంతికే నిస్సంక పెవిలియన్ చేరి ఆ అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. 61/2 స్కోరు వద్ద ఢిల్లీ పటిష్టంగా ఉన్నా, చెన్నై బౌలర్లు తమ వ్యూహాన్ని మార్చి ఢిల్లీని దెబ్బకొట్టారు. ఓవర్టన్, ఖలీల్, కాంబోజ్ తమ పేస్‌తో రెడ్ సాయిల్ పిచ్‌పై అదనపు బౌన్స్‌ను రాబట్టారు. దీంతో ఢిల్లీ బ్యాటర్లు షాట్లు ఆడలేక ఇబ్బంది పడ్డారు. చివరికి ఢిల్లీ 183/8 వద్ద ఆగిపోవడంతో చెన్నై ఈ సీజన్‌లో తన తొలి విజయాన్ని నమోదు చేయగా, ఢిల్లీ వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది.
LMAO the script is getting too obvious now!
Umpires allow Sanju Samson to change his helmet mid-over without a word, but the second Tristan Stubbs asks for fresh gloves because he can’t even grip the bat in this humidity, suddenly they’re the “Time Management Police”?… https://t.co/9xD6Fz9obB
— OldMonkOfCricket (@BhushanManmath) April 12, 2026
